లారీని ఢీ కొన్న కారు: ముగ్గురికి గాయాలు | Car, Lorry Accident in Himayat sagar | Sakshi
Sakshi News home page

లారీని ఢీ కొన్న కారు: ముగ్గురికి గాయాలు

Jul 25 2014 8:31 AM | Updated on Aug 25 2018 6:08 PM

హిమాయత్ సాగర్ వద్ద కారు లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

హైదరాబాద్: హిమాయత్ సాగర్ వద్ద కారు లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులలో ఇద్దరు విదేశీయులు ఉన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement