బ్యూటీ & gym | Body Fitness for ladies | Sakshi
Sakshi News home page

బ్యూటీ & gym

Jul 2 2014 12:23 AM | Updated on Apr 3 2019 5:34 PM

బ్యూటీ & gym - Sakshi

బ్యూటీ & gym

బాడీ ఫిట్‌నెస్ అంటే రకరకాల జిమ్ సెంటర్లు గుర్తుకొస్తాయి. వాటిలో ఎక్కువగా పురుషులే కనిపిస్తుంటారు. మహిళలు ఇలాంటి ఫిట్‌నెస్ సెంటర్లకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఫీలవుతుంటారు.

బాడీ ఫిట్‌నెస్ అంటే రకరకాల జిమ్ సెంటర్లు గుర్తుకొస్తాయి. వాటిలో ఎక్కువగా పురుషులే కనిపిస్తుంటారు. మహిళలు ఇలాంటి ఫిట్‌నెస్ సెంటర్లకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అలాంటి వారికోసం కాలనీలోని ప్రతి బ్యూటీ పార్లర్లలోనూ లేడీస్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఖర్చుతో జిమ్ ఎక్విప్‌మెంట్ అందుబాటులో ఉంచుతున్నారు.

బ్యూటీ పార్లర్లలో ఉన్న ఈ జిమ్‌లపై కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులతో పాటు గృహిణులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఫీజు కూడా తక్కువే ఉండటంతో ఈ సెంటర్లకు క్యూ కడుతున్నారు. వీటికి వెళుతున్న మహిళలు ఎక్కువగా ట్రెడ్ మిల్, సిటప్స్, సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తున్నట్టు ఓ జిమ్ ఉద్యోగిని స్వప్న తెలిపారు.

విజయారెడ్డి
 
 

Advertisement
 
Advertisement
Advertisement