కాంగ్రెస్‌ నేతలది సంకుచిత ధోరణి: లక్ష్మణ్‌ | BJP leaders welcome Venkiah Naidu | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతలది సంకుచిత ధోరణి: లక్ష్మణ్‌

Jul 28 2017 12:54 AM | Updated on Mar 28 2019 8:40 PM

కాంగ్రెస్‌ నేతలది సంకుచిత ధోరణి: లక్ష్మణ్‌ - Sakshi

కాంగ్రెస్‌ నేతలది సంకుచిత ధోరణి: లక్ష్మణ్‌

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వంటి ఉన్నత పదవుల విషయంలో కూడా కాంగ్రెస్‌పార్టీ నేతలు సంకుచిత ధోరణితో వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు.

వెంకయ్యకు ఘనస్వాగతం పలికిన బీజేపీ నేతలు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వంటి ఉన్నత పదవుల విషయంలో కూడా కాంగ్రెస్‌పార్టీ నేతలు సంకుచిత ధోరణితో వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్‌ వేసిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన వెంకయ్య నాయుడుకు గురువారం బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, పార్టీ ఇతర ముఖ్యనేతలు వెంకయ్యను విమానాశ్రయంలో కలిశారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ వివిధ హోదాల్లో పనిచేసిన వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నిక అవుతుంటే తెలుగువారిగా స్వాగతించాల్సిందిపోయి అసత్య, అసందర్భ ఆరోపణలకు దిగడం కాంగ్రెస్‌ నేతల కురచబుద్ధికి నిదర్శనమన్నారు. జైరాం రమేశ్‌ వంటి జాతీయ కాంగ్రెస్‌నేతలు కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి కుటిల బుద్ధితో ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. వెంకయ్య నాయుడులాంటి సీనియర్‌ నాయకుడు ఏ స్థాయిలో ఉన్నా రాష్ట్ర ప్రజలకు సేవలు అందుతాయని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement