మధుయాష్కీ మతి భ్రమించింది : బాల్క సుమన్ | Balka Suman Fires on Madhu yaskhi | Sakshi
Sakshi News home page

మధుయాష్కీ మతి భ్రమించింది : బాల్క సుమన్

Aug 17 2016 2:59 AM | Updated on Aug 15 2018 8:58 PM

మధుయాష్కీ మతి భ్రమించింది : బాల్క సుమన్ - Sakshi

మధుయాష్కీ మతి భ్రమించింది : బాల్క సుమన్

స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం తప్పుల తడక అని విమర్శించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధుయాష్కీపై ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు.

సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం తప్పుల తడక అని విమర్శించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధుయాష్కీపై ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలనే సీఎం ప్రస్తావించారని, మధుయాష్కీ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్, కేవీపీలు బినామీ వ్యాపారాలు చేస్తున్నారంటూ యాష్కీ వ్యాఖ్యానించడం పై మంగళవారమిక్కడ స్పందిస్తూ... ఆధారాలుంటే నిరూపించాలని, లేదంటే నోరు మూసుకోవాలన్నారు. సంఘ వ్యతిరేక శక్తిగా మారిన నయీమ్‌ను గత ప్రభుత్వాలే పెంచి పోషించాయని సుమన్ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement