బరిలో... అబ్బాయ్ - బాబాయ్!? | Babai and abbai in the Ring | Sakshi
Sakshi News home page

బరిలో... అబ్బాయ్ - బాబాయ్!?

Jan 10 2016 7:13 AM | Updated on Mar 29 2019 9:31 PM

బరిలో... అబ్బాయ్ - బాబాయ్!? - Sakshi

బరిలో... అబ్బాయ్ - బాబాయ్!?

గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్‌లో అబ్బాయి-బాబాయిలు బరిలో ప్రత్యర్థులుగా నిలిచే పరిస్థితులు కన్పిస్తున్నాయి.

గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్‌లో అబ్బాయి-బాబాయిలు బరిలో ప్రత్యర్థులుగా నిలిచే పరిస్థితులు కన్పిస్తున్నాయి. మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రం గౌడ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండగా...ముఖేష్ గౌడ్ సోదరుడు మధుగౌడ్ బీజేపీ నుంచి ఇదే స్థానంలో పోటీ చేసేందుకు ఉద్యుక్తుడవుతున్నారు. మధు గౌడ్ గతేడాది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. వాస్తవానికి విక్రంగౌడ్ గన్‌ఫౌండ్రి డివిజన్‌పై ఆశలు పెట్టుకోగా ఆ స్థానం మహిళలకు రిజర్వు అయింది. వెంటనే ఆయన తాను జాంబాగ్ నుంచి పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు.

తానేమీ తక్కువ కాదంటూ మధుగౌడ్ సైతం జాంబాగ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని తన అనుచరులతో కలిసి ప్రకటించారు. దీంతో ఈ స్థానంలో అబ్బాయి-బాబాయిల పోటీ చూడాల్సి వస్తుందేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
 - అబిడ్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement