సైబర్ నేరాల వల్ల యువత, ఎక్కువగా మహిళలు జీవితాన్ని కోల్పోతున్నారని, వాటి నుంచి రక్షించుకోవడానికి అవగాహన సదస్సులు
హైదరాబాద్: సైబర్ నేరాల వల్ల యువత, ఎక్కువగా మహిళలు జీవితాన్ని కోల్పోతున్నారని, వాటి నుంచి రక్షించుకోవడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు ‘ఇంటర్నేషనల్ ఉమెన్ సెక్యూరిటీ వెల్ఫేర్ ఫౌండేషన్’ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఆయా ప్రభుత్వాల సహకారంతో ‘సైబర్ ఫోరెన్సిక్ సొల్యూషన్స్’ ద్వారా యువతకు ఈ సదస్సులు నిర్వహిస్తామని తెలిపింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని బుధవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు జ్యోత్సా్నరెడ్డి, శుభమంగళ చెప్పారు.
ఎన్నో ఘటనలు జరుగుతున్నప్పటికీ అతి తక్కువ సంఖ్యలో సైబర్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. తమకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని వారి సంఖ్య లక్షల్లో ఉందని తెలిపారు. ఇటువంటి వారి కోసం బంజరాహిల్స్‌లో ‘సైబర్ ఫోరెన్సిక్ సొల్యూషన్స్’ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సదస్సుల్లో సైబర్ నేరాలు, ఇంటర్నెట్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామన్నారు.