లోటస్‌ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత | attention at lotus hospital | Sakshi
Sakshi News home page

లోటస్‌ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత

Mar 30 2017 2:33 PM | Updated on Sep 5 2017 7:30 AM

వైద్యుల నిర్లక్ష్యంతో గిరిజన బాలుడు మృతిచెందాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

హైదరాబాద్‌: వైద్యుల నిర్లక్ష్యంతో గిరిజన బాలుడు మృతిచెందాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దానితో పాటు ఆస్పత్రిపై దాడి చేసి ఆస్పత్రి అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వసం చేశారు. నగరంలోని లక్డీకాపుల్‌ లోటస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ గిరిజన బాలుడు గురువారం ఉదయం మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన అతని బంధువులు ఆస్పత్రిపై దాడి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి చుట్టుపక్కల భారీగా పోలీసులను మొహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement