'యనమల నిబంధనలు తెలుసుకో' | Ap governement doing unethical things: sujayakrishna rangarao | Sakshi
Sakshi News home page

'యనమల నిబంధనలు తెలుసుకో'

Dec 21 2015 11:50 AM | Updated on Oct 29 2018 8:08 PM

ఏపీ అసెంబ్లీ తీరు దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుజయకృష్ణ రంగారావు అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే రోజాపై సస్పెన్షన్ వేవారని అన్నారు.

హైదరాబాద్‌: ఏపీ అసెంబ్లీ తీరు దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుజయకృష్ణ రంగారావు అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే రోజాపై సస్పెన్షన్ వేవారని అన్నారు. వాస్తవానికి ఆఎపై వేటు నిబంధనలకు వ్యతిరేకం అని ఆయన అన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్, రోజా పై సస్పెన్షన్ అంశాలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం అసెంబ్లీ సమావేశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆ పార్టీ నేత సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ ప్రభుత్వ తీరు దురదృష్టకరమని అన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ అనే అంశం మహిళకు సంబంధించినదని, ఇందులో ఎక్కువమంది దళిత బాధితులే ఉన్నారని, ఈ విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వానికి వివరించి వారి కళ్లు తెరిపించాలనే ప్రయత్నంతోనే తమ నేత రోజా మాట్లాడారని, ఎక్కడ దోషులుగా దొరికిపోతామో అన్న భయంతో ఆమెపై ప్రభుత్వం అక్రమంగా సస్పెన్షన్ వేటు వేసిందని చెప్పారు. యనమల రామకృష్ణ నిబంధనలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement