మరో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు | again Drugs gang busted in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమికుల ముసుగులో డ్రగ్స్‌ సరఫరా

Jul 24 2017 9:10 AM | Updated on Oct 17 2018 5:28 PM

డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నైజీరియన్లను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌ : నగర శివారలో మరో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు అయింది. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న పలువురు నైజీరియన్లతో పాటు విజయవాడకు చెందిన ఓ యువతిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.50 లక్షలతో పాటు భారీగా ఎల్‌ఎస్‌డీ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో నైజీరియన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉన్నాడు. వీరందరినీ పోలీసులు రహస్యప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. కాగా ప్రేమికుల ముసుగులో గత కొంతకాలంగా వీరు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement