breaking news
durgs
-
పొద్దున్నేమో డైట్ ఫుడ్.., రాత్రికి డ్రగ్స్ : సినీతారలపై టాప్ డైరెక్టర్ వ్యాఖ్యలు
ఇటీవల సినీ తారల వ్యక్తిగత అలవాట్ల గురించి మీడియా కన్నా సినీ రంగంలోని వాళ్లే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంతేకాదు మీడియా నుంచి వచ్చే విమర్శల కన్నా ఇవి చాలా వాడిగా వేడిగా పదనుగా ఉంటున్నాయి. సహజంగానే సినీతారల గురించి అందరి కన్నా ఎక్కువగా తెలిసేది అదే రంగంలో ఉన్న దర్శకులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులకు కాబట్టి..వీరి విమర్శల్లో నిజం ఉంటుందని అనేక మంది భావిస్తుండడంతో ఇవి సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు తారలపై విమర్శలు గుప్పించే సినీ ప్రముఖుల జాబితాలో మరో అగ్రదర్శక నిర్మాత కూడా జేరారు. ఆయన పేరు పహ్లాజ్ నిహలానీ.భారతీయ చలనచిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ సాదా సీదా వ్యక్తి కాదు. ఆయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి) మాజీ ఛైర్మన్ కూడా. ఆయన గత 2009 వరకు 29 సంవత్సరాల పాటు సినిమాలు, టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నిహలానీ 1982లో హాత్కడితో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు నాటి టాప్ హీరో గోవింద (ఇల్జామ్, 1986) చంకీ పాండే (ఆగ్ హి ఆగ్, 1987) వంటి పలువురు నటులను పరిచయం చేశారు. షోలా ఔర్ షబ్నం ఆంఖేన్ తో సహా అనేక ప్రసిద్ధ చిత్రాలను నిర్మించారు. ఆయన 2012లో అవతార్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.ఆ ప్రముఖ నిర్మాత మాజీ సిబిఎఫ్‌సి చీఫ్ పహ్లాజ్ నిహలానీ ప్రస్తుతం బాలీవుడ్లో విపరీతంగా పెరుగుతున్న విషపూరిత సంస్కృతిని విమర్శించడం సంచలనంగా మారింది. ఇటీవల లెర్న్ ఫ్రమ్ ది లెజెండ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త తరం సెలబ్రిటీ జీవనశైలిని ఆకర్షణీయమైన ముఖభాగాల వెనుక దాగి ఉన్న నిరంతర మాదకద్రవ్య సేవనాన్ని తూర్పారబట్టారు.గతంలో ఒక నటుడు మాత్రమే కనిపిస్తే, నేడు నటులు పది మంది బృందాలతో కనిపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. నిన్న కాక మొన్న వచ్చిన కొత్తవారు కూడా తమ సొంత మేకప్ ఆర్టిస్ట్, హెయిర్డ్రెస్సర్ల నుంచి తమ అద్దం పట్టుకోవడానికి కూడా పర్సనల్ అసిస్టెంట్ కావాలంటున్నారని, అలాగే వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్‌ను కలిగి ఉండాలని పట్టుబడుతున్నారన్నాని వెల్లడించారు. చివరికి వీటన్నింటికీ ఖర్చులు నిర్మాత జేబుల నుంచే చెల్లిస్తారని ఆయన గుర్తు చేశారు. వ్యాయామం చేయడం, వంట చేయడం సమావేశాలు నిర్వహించడం వంటి వాటి కోసం ఏకంగా ఆరు వేర్వేరు వానిటీ వ్యాన్ల డిమాండ్ కూడా చేస్తున్నారని ఇది చాలా ఓవర్‌గా ఉందన్నారు. .చాలా మంది నటులు ద్వంద్వ జీవితాలను గడుపుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.. పగటిపూట శుభ్రమైన,ఆరోగ్యకర ఆహారం డిమాండ్ చేస్తూ, రాత్రిపూట మత్తుపదార్ధాల వినియోగంలో మునిగిపోతున్నారన్నారు. తారలు తరచుగా ప్రాథమిక సేవల కోసం పెంచిన బిల్లులను సమర్పిస్తారని, మేకప్ ఖర్చులే లక్షల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోందా అని అడిగినప్పుడు స్పందిస్తూ, ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందని కొన్ని సందర్భాల్లో, కొంతమంది నటుల ప్రవర్తనలో కూడా అది స్పష్టంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు.అంతేకాదు...తాను తీసిన తలాష్: ది హంట్ బిగిన్స్... చిత్రం సందర్భంగా జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ, హీరో అక్షయ్ కుమార్ తన పక్కన కరీనా కపూర్‌ను ప్రధాన పాత్రగా తీసుకోవాలని పట్టుబట్టారని కూడా ఆయన వెల్లడించారు. తన కెరీర్లో ఒక నటుడు ఇలాంటి డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి అని, ఇది సాంప్రదాయ నిర్మాత–దర్శకుడు కాస్టింగ్ విధానాన్ని అధిగమించిందని నిహలానీ పేర్కొన్నారు. ఇప్పుడు అది సాధారణంగా మారిపోయిందన్నారు. నేడు, నటులు తరచుగా తారాగణం నుంచి దర్శకుడు సిబ్బంది వరకు ప్రధాన నిర్ణయాలను అన్నింటినీ నియంత్రిస్తున్నారని ఆయన వెల్లడించారు. హీరో, హీరోయిన్స్ మధ్య వయసు తేడా ల గురించి మాట్లాడుతూ వృద్ధ నటులు తాము యంగ్‌గా కనిపించడానికి యువ తారల్ని ఇష్టపడతారని ఆయన ఎద్దేవా చేశారు. -
డ్రగ్ గుట్టు రట్టు 95 కిలోలు స్వాధీనం
-
24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ
-
డ్రగ్స్ కేసులో ఎంతోమంది దొరికినా సినీ పరిశ్రమ పైనే ఎందుకు టార్గెట్ ?
-
గంజాయి వనాన్ని పెంచి పోషించింది చంద్రబాబేనా ?
-
డ్రగ్స్ కేసులో అంజన్ కుమార్ కొడుకు.. ఆయన కామెంట్స్ ఇవే..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అరవింద్ కూడా ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ స్పందిస్తూ..‘‘ నా కుమారుడు బర్త్ డే పార్టీకి వెళ్లాడు. ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తే అభాండాలు వేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మా కుటుంబం అలాంటిది కాదు. దీనిలో నిజానిజాలు తేల్చాలి. సిటీలో ఉన్న అన్ని పబ్‌లను మూసివేయాలి. మద్యపాన నిషేధం విధించాలి’’ అని అన్నారు. -
మళ్లీ తెరపైకి సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు
-
టాలీవుడ్లో డ్రగ్స్ తీసుకోవడం చూశా..
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో డ్రగ్స్‌పై నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ తీసుకోవడం ప్రత్యక్షంగా చూశాని, బయటకు చెప్తే తన ప్రాణానికి ప్రమాదమని భయంతో ఎవరికీ చెప్పలేదని అన్నారు. ఎక్సైజ్ విచారణ తర్వాత కూడా టాలీవుడ్ తీరు మారలేదని ఆమె విమర్శించారు. టాలీవుడ్‌లోనూ డ్రగ్స్‌పై అధికారులు దృష్టి పెట్టాలని మాధవీలత డిమాండ్ చేశారు. ఇటీవల జిన్నారంలో పట్టుబడ్డ వందల కోట్ల డ్రగ్స్‌కి టాలీవుడ్‌కి సంబంధం ఉంటుందని ఆమె ఆరోపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ విక్రయించేవారు ఎవరు? బాధితులు ఎవరు అనేది అధికారులు తేల్చాలని అన్నారు. సినీ నటులు అందం, ఫిట్నెస్ కోసం మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటారని అన్నారు. (చదవండి : 'డ్రగ్స్ లేనిదే టాలీవుడ్లో పార్టీలు జరగవు') టాలీవుడ్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దృష్టి పెట్టాలని మాధవి లత డిమాండ్ చేశారు. కాగా, బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నటి మాధవీలత మొదటి నుంచి సమర్థిస్తున్నారు. బాలీవుడ్లోనే కాదు,టాలీవుడ్లో కూడా డ్రగ్స్ వాడుతున్నారని ఆమె ఆరోపించారు. టాలీవుడ్లో జరిగే పార్టీల్లో డ్రగ్స్ వాడుతారని.. అది లేకుండా అసలు పార్టీలు జరగవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2007లో వచ్చిన అతిథి చిత్రంతో వెండితెరకు పరిచమైన మాధవిలత , నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా మారింది. నానితో కలిసి స్నేహితుడు మూవీలో నటించింది. -
కూకట్‌పల్లిలో డ్రగ్స్ కలకలం!
సాక్షి, హైదరాబాద్ : ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో ఓ కంపెనీ యజమానిని మరో కంపెనీకి చెందిన వ్యక్తులు దారుణంగా హత్యచేసి పూడ్చివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి సీఐ ప్రసన్నకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన నేరెళ్ల చంద్రశేఖర్(40) ప్రశాంత్‌నగర్‌లో గాజు గ్లాస్‌ల కంపెనీ నిర్వహిస్తున్నాడు. గ్లాస్ తయారీ పరిశ్రమ ముసుగులో అతడు డ్రగ్స్‌సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2017 జనవరిలో డ్రగ్స్ కేసులో చంద్రశేఖర్ జైలుకు వెళ్లివచ్చాడు. కాగా డ్రగ్స్ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన కెమికల్ కంపెనీ నిర్వాహకుడు భూషణ్‌పాండే, సంతోష్‌సింగ్, మత్స్యగిరిలతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గత నెల 16న చంద్రశేఖర్ వద్ద నుంచి డబ్బులు రాబట్టేందుకుగాను వారు తమ అనుచరులతో కలిసి పథకం పన్నారు. చంద్రశేఖర్‌ను స్థానిక కార్పొరేషన్ బ్యాంక్ వద్దకు రప్పించి అక్కడి నుంచి కారులో కొంపల్లికి తీసుకువెళ్లారు. తమకు రూ. రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బులేదని చంద్రశేఖర్ చెప్పడంతో ఆగ్రహానికి గురైన మత్సగిరి, భూషణ్‌ఫాండే, సంతోష్‌సింగ్ తమ అనుచరులు మరో 9 మందితో కలిసి అతడిని చితకబాదడంతో మృతి చెందాడు. అనంతరం వారు మృతదేహాన్ని కొర్రేముల గ్రామ సమీపంలోని ఔటర్‌రింగ్ వద్ద పూడ్చిపెట్టారు. తన భర్త కనిపించడంలేదని చంద్రశేఖర్ భార్య శోభ సెప్టెంబర్ 18న కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టగా హత్య విషయం వెలుగుచూసింది. దీంతో మత్సగిరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. -
మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ : నగర శివారలో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న పలువురు నైజీరియన్లతో పాటు విజయవాడకు చెందిన ఓ యువతిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.50 లక్షలతో పాటు భారీగా ఎల్ఎస్డీ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో నైజీరియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నాడు. వీరందరినీ పోలీసులు రహస్యప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. కాగా ప్రేమికుల ముసుగులో గత కొంతకాలంగా వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భీమవరంలో డ్రగ్స్ సంచలనం
భీమవరం టౌన్: రాష్ట్రంలో సంచలనం కలిగించిన డ్రగ్స్ వాడకం కేసుకు సంబంధించి అధికారులు పరుగులు తీస్తున్నారు. కాకినాడ నుంచి ప్రత్యేక అధికారుల బృందం జిల్లావ్యాప్తంగా హోల్‌సేల్ మందుల దుకాణాలను తనిఖీ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దగ్గుకు సంబంధించి డ్రగ్ మోతాదు అధికంగా ఉన్న సిరప్స్‌ను ఎక్కువగా విక్రయించడం, నిల్వ చేసినవారిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం సోమవారం భీమవరం ప్రాంతంలో తనిఖీలు చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమతో పాటు తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు.