రాష్ట్రంలో సంచలనం కలిగించిన డ్రగ్స్ వాడకం కేసుకు సంబంధించి అధికారులు పరుగులు తీస్తున్నారు. కాకినాడ నుంచి ప్రత్యేక అధికారుల బృందం జిల్లావ్యాప్తంగా హోల్‌సేల్ మందుల దుకాణాలను తనిఖీ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
భీమవరంలో డ్రగ్స్ సంచలనం
Jul 18 2017 12:39 AM | Updated on Sep 5 2017 4:15 PM
భీమవరం టౌన్: రాష్ట్రంలో సంచలనం కలిగించిన డ్రగ్స్ వాడకం కేసుకు సంబంధించి అధికారులు పరుగులు తీస్తున్నారు. కాకినాడ నుంచి ప్రత్యేక అధికారుల బృందం జిల్లావ్యాప్తంగా హోల్‌సేల్ మందుల దుకాణాలను తనిఖీ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దగ్గుకు సంబంధించి డ్రగ్ మోతాదు అధికంగా ఉన్న సిరప్స్‌ను ఎక్కువగా విక్రయించడం, నిల్వ చేసినవారిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం సోమవారం భీమవరం ప్రాంతంలో తనిఖీలు చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమతో పాటు తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు.
Advertisement


