వారి నుంచి ప్రాణహాని ఉంది: సినీనటి పూజిత | actress poojitha complaint on her husband | Sakshi
Sakshi News home page

వారి నుంచి ప్రాణహాని ఉంది: సినీనటి పూజిత

May 10 2016 6:19 PM | Updated on Apr 3 2019 9:13 PM

వారి నుంచి ప్రాణహాని ఉంది: సినీనటి పూజిత - Sakshi

వారి నుంచి ప్రాణహాని ఉంది: సినీనటి పూజిత

తన భర్త విజయ్గోపాల్, ఐఏఎస్ అధికారిణి రేఖారాణి నుంచి ప్రాణహాని ఉందని సినీ నటి పూజిత ఆరోపించింది.

హైదరాబాద్: తన భర్త విజయ్గోపాల్, ఐఏఎస్ అధికారిణి రేఖారాణి నుంచి ప్రాణహాని ఉందని సినీ నటి పూజిత ఆరోపించింది. మంగళవారం ఆమె ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది.

విడాకులివ్వకుండానే తన భర్త రేఖారాణిని వివాహం చేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన ఐడీ ఫ్రూవ్, ఇతర వివరాలను పోలీసులకు సమర్పించినట్లు తెలిపింది. తన కుమారుడికి, తనకు న్యాయం జరిగేలా చూడాలని పూజిత కోరింది. 

Advertisement
 
Advertisement
Advertisement