శివలింగం ఇంటిపై ఏసీబీ దాడి | ACB ride on asst motor vehicle inspector | Sakshi
Sakshi News home page

శివలింగం ఇంటిపై ఏసీబీ దాడి

Apr 9 2015 9:25 AM | Updated on Aug 17 2018 12:56 PM

సరూర్నగర్లోని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివలింగంతోపాటు ఆయన బంధువుల నివాసంపై ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో దాడి చేశారు.

హైదరాబాద్ : సరూర్నగర్లోని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివలింగంతోపాటు ఆయన బంధువుల నివాసంపై ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో దాడి చేశారు. వారి నివాసాల్లో ఏసీబీ అధికారులు సొదాలు నిర్వహిస్తున్నారు. ఏఎంవీఐగా విధులు నిర్వహిస్తున్న శివలింగం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ఆయనపై ఆగంతకులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఏసీబీ అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలతోపాటు భారీగా నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement