ఇంటర్‌కు ఆధార్‌ తప్పనిసరి | Aadhaar mandatory for Inter | Sakshi
Sakshi News home page

ఇంటర్‌కు ఆధార్‌ తప్పనిసరి

May 24 2017 12:34 AM | Updated on Sep 5 2017 11:49 AM

ఇంటర్‌ ప్రవేశాలకు ఆధార్‌ నంబరు తప్పనిసరని ఇంటర్మీడియెట్‌ బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రవేశాలకు ఆధార్‌ నంబరు తప్పనిసరని ఇంటర్మీడియెట్‌ బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి విద్యార్థి ఆధార్‌ కార్డును సమకూర్చుకోవాలని బోర్డు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, మోడల్‌ స్కూల్స్, గురుకులాలు, అన్ని మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో ఇంటర్మీడియెట్‌లో చేరాలనుకునే విద్యార్థులు 201718 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆధార్‌ను సిద్ధం చేసుకోవాలని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement