కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య | A person commits suicide with family disputes | Sakshi
Sakshi News home page

కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Sep 14 2016 5:17 PM | Updated on Nov 6 2018 8:04 PM

భార్యతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఒక వ్యక్తి విషం తాగి తనువు చాలించాడు.

భార్యతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఒక వ్యక్తి విషం తాగి తనువు చాలించాడు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక లక్ష్మారెడ్డిపాలెం మైత్రీకుటీర్ నివాసి చెర్కుపల్లి నరేందర్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాగా, అతనికి కొంతకాలంగా భార్యతో గొడవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన నరేందర్ బుధవారం ఉదయం ఇంట్లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement