ప్రాజెక్టులపై విపులంగా చర్చించాలి: చాడ | A brief talk on the projects: Chada | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులపై విపులంగా చర్చించాలి: చాడ

Mar 26 2016 3:50 AM | Updated on Sep 3 2017 8:34 PM

ప్రాజెక్టులపై విపులంగా చర్చించాలి: చాడ

ప్రాజెక్టులపై విపులంగా చర్చించాలి: చాడ

నీటిపారుదల ప్రాజెక్టులపై అసెంబ్లీలో విపులంగా చర్చించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేసి జల విధానానికి రూపకల్పన చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టులపై అసెంబ్లీలో విపులంగా చర్చించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేసి జల విధానానికి రూపకల్పన చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో అధికారపార్టీ బలం పెరిగిందని, అన్ని ఎన్నికల్లో గెలుస్తున్నామనే అహంభావపూరిత ఆలోచనలతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల నిర్మాణ అంచనా వ్యయం రూ.38 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెరిగిందన్నారు. చర్చ లేకుండా తడికెపల్లి, పాములపర్తి వద్ద రిజర్వాయర్ల సామర్థాన్ని ఆగమేఘాల మీద 20, 50 టీఎంసీలకు పెంచడమేంటని ప్రశ్నించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement