మరోసారి పట్టుబడిన బంగారం | 500 grams of gold seized at shamshabad airport | Sakshi
Sakshi News home page

మరోసారి పట్టుబడిన బంగారం

Aug 1 2014 8:46 AM | Updated on Aug 2 2018 4:05 PM

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఉదయం ఓ ప్రయాణికుడి నుంచి 500 గ్రామల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నరు.

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఉదయం ఓ ప్రయాణికుడి నుంచి 500 గ్రామల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నరు. తనిఖీల్లో భాగంగా సింగపూర్ నుంచి వచ్చిన అశోక్‌ లాల్ అనే వ్యక్తి నుంచి అధికారులు ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

ఇటీవలి కాలంలో శంషాబాద్ విమానాశ్రయం అక్రమంగా బంగారం రవాణా చేసే అడ్డాగా మారిపోయింది. స్మగ్లర్లు బంగారాన్ని విదేశాల నుంచి తీసుకు వచ్చేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ను ఉపయోగించుకుంటున్నారు. ఓవైపు కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో పట్టుబడుతున్నా...మరోవైపు అక్రమ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement