విమానం టాయిలెట్‌లో బంగారం.. ఎంతుందంటే..? | Customs Detect Hidden 2.8 kg Gold Bars Worth ₹4.26 Crore In Aircraft Toilet Speaker Box, More Details Inside | Sakshi
Sakshi News home page

విమానం టాయిలెట్‌లో బంగారం.. ఎంతుందంటే..?

Jun 13 2026 6:47 PM | Updated on Jun 13 2026 7:53 PM

Authorities find huge amount of gold during check on Ahmedabad flight

అహ్మదాబాద్‌, సాక్షి:  గుజరాత్‌లో కస్టమ్‌ అధికారుల నిర్వహించిన తనిఖీల్లో  భారీగా బంగారం దొరికింది. అధికారులు రెగ్యూలర్‌ తనిఖీల్లో భాగంగా సోదాలు జరుపుతుండగా ప్లాస్టిక్‌ టేపులతో చుట్టిన రెండు బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. దానిని విప్పి చూడగా అందులో పెద్ద మెుత్తంలో బంగారు బిస్కెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు.  

దుబాయి నుండి అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి వస్తున్న ఇండిగో ఫ్లైట్ నెం. 6E-1478లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంలో విమానం ముందు భాగంలోని టాయిలెట్‌ స్పీకర్‌ బాక్స్‌లో రెండు నల్లరంగు పర్సులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇంజినీర్ల సాయంతో వాటిని స్వాధీనం చేసుకొని వాటిని తెరిచారు. రెండు పర్సులలో దాదాపు 2,799.3 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల స్వచ్ఛతగల బంగారు బిస్కెట్లను గుర్తించారు. మార్కెట్లో వీటి విలువ రూ. 4,26,89,325 గా తెలిపారు.

అయితే భారత్‌లోకి బంగారం అక్రమంగా రవాణా చేసే భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేసే ఉద్దేశ్యంతో ఒక గుర్తు తెలియని వ్యక్తి బంగారాన్ని దాచి పెట్టినట్లు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం చట్టబద్ధమైన యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో 1962 కస్టమ్స్ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం దానిని ఎవరూ హక్కు కోరనిదిగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement