ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్న 50మంది అరెస్ట్ | 50 held for eve-teasing and indecency in secunderabad railway station | Sakshi
Sakshi News home page

ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్న 50మంది అరెస్ట్

Nov 29 2013 9:32 AM | Updated on Jul 11 2019 8:06 PM

సికింద్రాబాద్ లో మహిళా బోగీల్లో ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్న 50మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ సందర్బంగా మహిళా బోగీల్లో ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్న 50మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నారు.  లోకల్ రైళ్లలో ప్రయాణించే మహిళలకు భద్రత కరువైంది.

వారికి ప్రత్యేకంగా కేటాయించిన బోగీలలోనూ పురుషులు ఎక్కి దురుసుగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ డ్రైవ్ చేపట్టారు. కాగా తమకు కేటాయించిన ప్రత్యేక బోగీలలో పోలీసులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సమయాలలో తాము ఎవరికి ఫిర్యాదు చేయాలని మహిళా ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement