
రైలు ప్రయాణాల్లో పిల్లలు, పెద్దలూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా రైలు ఎక్కేటపుడు, దిగేటపుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు అసలు పనికి రాదు. ప్రాణాలు ముఖ్యం అనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. తాజాగా కేరళలో జరిగిన ఒక ఘటన ఈ విషయాలను మరోసారి గుర్తు చేస్తుంది.
కేరళలోని ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్‌లో ఒక మహిళను ప్రాణాపాయం నుంచి కాపాడిన ఘటన విశేషంగా నిలిచింది. రైలు నుండి దిగడానికి ప్రయత్నించినప్పుడు ఆమె బ్యాలెన్స్ కోల్పోయింది. దాదాపు పట్టాలపై పడిపోయింది. అక్కడనే రైల్వే ఉద్యోగి రాఘవన్ ఉన్ని తక్షణమే స్పందించారు. ఆమెను ఒడుపుగా పట్టుకొని పక్కకు లాగారు. వెంటనే అలర్ట్ అయ్యి శరవేగంగా ఆయన స్పందించకపోతే ఆమె ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. ఆసీసీ టీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ఆగస్టు 9న జరిగిన ఈ సంఘటన నెట్టింట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు రాఘవన్ చాకచక్యంపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు రైల్వే సిబ్బంది అంకితభావాన్ని ప్రశంసిస్తూనే, మెరుగైన భద్రతా చర్యల అవసరాన్ని కూడా నొక్కి చెబుతుండటం గమనార్హం.
ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్‌పేజీపై మెరిసిన సమంత
Kerala : ಚಲಿಸುವ ರೈಲಿನಿಂದ ಇಳಿಯಲು ಹೋದ ಮಹಿಳೆಗೆ ಏನಾಯಿತು ನೋಡಿ.? | Sanjevani News
.
.
.
.#kerala #train #Ernakulam #NorthRailwayStation #viralvideo #ಕೇರಳ pic.twitter.com/LTd6J1YQmF— Sanjevani News (@sanjevaniNews) August 20, 2025
కాగా 2022లో ఇలాంటి ఘటన ఒకటి రైలు ప్రమాదాల్లో సిబ్బంది అప్రమత్తతను గుర్తు చేస్తూ కేరళలోని తిరూర్ రైల్వే స్టేషన్‌లో సతీష్ అనే RPF హెడ్ కానిస్టేబుల్ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారిపడిన మైనర్ బాలికను రక్షించాడు. దీనికి సంబంధించిన RPF ఇండియా విడుదల చేసింది. ఈ వీడియోలో లిప్తపాటులో స్పందించి కానిస్టేబుల్ అమ్మాయిని రక్షించాడు.