కుషాయిగూడలో ఆకతాయిల అరెస్టు | 3 arrested in kushaiguda | Sakshi
Sakshi News home page

కుషాయిగూడలో ఆకతాయిల అరెస్టు

Mar 11 2016 3:16 PM | Updated on Sep 3 2017 7:30 PM

పీకల దాకా మద్యం తాగి ఇద్దరిపై దాడి చేసిన ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: పీకల దాకా మద్యం తాగి ఇద్దరిపై దాడి చేసిన ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాధిక హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద గురువారం రాత్రి ఆకతాయిలు వీరంగం సృష్టించారు. రవి చౌదరి, రాహుల్ అనే యువకులపై దాడి చేయటంతో వారు గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. ఆ మేరకు కిరణ్, కృష్ణ, మహేష్ అనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement