శంషాబాద్ విమానాశ్రయంలో 3.26 కేజీల గోల్డ్ సీజ్ | 3.26 kg of gold seized at Rajiv Gandhi International Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ విమానాశ్రయంలో 3.26 కేజీల గోల్డ్ సీజ్

Jun 11 2016 8:15 AM | Updated on Sep 4 2017 2:15 AM

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.97 లక్షల విలువైన 3.26 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు శనివారం సీజ్ చేశారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 28 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement