పెన్షనర్లకు డీఆర్ పెంపు | 3.144% DR hike for pensioner | Sakshi
Sakshi News home page

పెన్షనర్లకు డీఆర్ పెంపు

Sep 8 2016 7:58 PM | Updated on Sep 4 2017 12:41 PM

పెన్షనర్లకు కరువు భృతిని(డీఆర్) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లకు ప్రస్తుతం 15.196 శాతం డీఆర్ అమల్లో ఉంది.

హైదరాబాద్: పెన్షనర్లకు కరువు భృతిని(డీఆర్) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లకు ప్రస్తుతం 15.196 శాతం డీఆర్ అమల్లో ఉంది. అదనంగా 3.144 శాతం కలిపి... ఇప్పట్నుంచి 18.340 శాతం డీఆర్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2016 జనవరి నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకష్ణారావు గురువారం ఉత్తర్వులు (జీవో 112) జారీ చేశారు. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే పద్ధతిన పెన్షనర్లకు డీఆర్‌ను వర్తింపజేసింది.

జనవరి నుంచి చెల్లించాల్సిన బకాయిలను సెప్టెంబర్ పెన్షన్‌తో కలిపి చెల్లించనుంది. అక్టోబరు ఒకటిన బకాయిలతో పాటు పెరిగిన డీఆర్‌తో కూడిన పెన్షన్ వారి చేతికందుతుంది. 2013 జులై 1 తర్వాత రిటైరై పెన్షన్ అందుకుంటున్న ఉద్యోగులతో పాటు అప్పటికే రిటైరై పెన్షన్ అందుకంటున్న వారందరికీ ఈ డీఆర్ వర్తిస్తుంది. ఈ ఉత్తర్వుల ఆధారంగా ట్రెజరీ అధికారులు, పెన్షన్ పేమేంట్ అధికారులు వచ్చే నెల బిల్లుల చెల్లింపులు చేయాలని ఆర్థిక శాఖ అన్ని ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement