జంట జిల్లాల పరిధిలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలో 17 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు.
సాక్షి, సిటీబ్యూరో: జంట జిల్లాల పరిధిలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలో 17 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. హైదరాబాద్ జిల్లాలో మెహదీపట్నంలోని ఎల్‌బీ జూనియర్ కాలేజ్‌లో ఒకరు, శ్రీ అరబిందో జూనియర్ కాలేజీలో ఇద్దరు, పాతబస్తీలోని అల్హబెత్ కాలేజీలో నలుగురు, ఖైరతాబాద్‌లోని షాదాన్ జూనియర్ కాలేజీలో ఐదుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో ఐదుగురిపై మాల్ ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేసినట్లు జంట జిల్లాల ఆర్‌ఐఓలు రవికుమార్, గౌరీ శంకర్‌లు తెలిపారు. మొత్తం 2,01,248 మందికి గాను 1,90,721 మంది విద్యార్థులు (94.76 శాతం) పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్ జిల్లాలో 94.62 శాతం, రంగారెడ్డి జిల్లాలో 94.87 శాతం విద్యార్థులు పరీక్ష రాశారు.