ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్)ను 16న రాష్ట్రవ్యాప్తంగా 1,975 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ జగదీశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు 4,49,902 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. పేపరు-1 ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపరు-2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని వెల్లడించారు.
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్)ను 16న రాష్ట్రవ్యాప్తంగా 1,975 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ జగదీశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు 4,49,902 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. పేపరు-1 ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపరు-2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని వెల్లడించారు. aptet.cgg.gov.in నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికె ట్‌లో అభ్యర్థి ఫొటో లేకుంటే ఫొటోను స్కాన్ చేసి (aptet.cgg.gov.in) పంపించి హాల్ టికెట్ పొందవచ్చని వివరించారు. ఆప్షనల్ సబ్జెక్టులో తప్పులు వస్తే రుజువులు చూపించి టెట్ కార్యాలయంలో సరి చేసుకోవచ్చు.
దరఖాస్తులు 1.23 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ దరఖాస్తులు 1.23 లక్షలకు చేరుకున్నాయి. గురువారం రాత్రి 10 గంటల వరకు 62 వేల మంది విద్యార్థులు, 61 వేల మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 20న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తుల్లో భాగంగా అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 35 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌కు 87 వేల దరఖాస్తులు అందాయి. మిగతా వారు రెండింటికి దరఖాస్తు చేసుకున్నారు.