ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి | 1 died in rtc bus accident in hyderabad | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి

Jul 2 2016 3:06 PM | Updated on Sep 4 2018 5:21 PM

వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

హైదరాబాద్: వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగింది. షాపూర్‌కు చెందిన శ్రీనివాస్(35) ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు బైక్ పై వెళ్తుండగా.. చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, బందువులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement