స్నేహితురాలని ఆశ్రయమిస్తే.. | Young woman Theft by Gold jewelry | Sakshi
Sakshi News home page

స్నేహితురాలని ఆశ్రయమిస్తే..

Jun 29 2016 2:15 AM | Updated on Aug 2 2018 4:53 PM

స్నేహితురాలని ఆశ్రయమిస్తే.. - Sakshi

స్నేహితురాలని ఆశ్రయమిస్తే..

స్నేహితురాలని ఆశ్రయమిస్తే బంగారం కాజేసి పోలీసులకు చిక్కిందో యువతి. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన...

బంగారు ఆభరాణాలు కాజేసిన యువతి
గూడూరు : స్నేహితురాలని ఆశ్రయమిస్తే బంగారం కాజేసి పోలీసులకు చిక్కిందో యువతి. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ సుబ్బారావు వెల్లడించిన వివరాల మేరకు.. గూడూరు రెండో పట్టణంలోని ఉడతా కుమారి రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తోంది. ఆమె తన తల్లి భువనేశ్వరితో కలసి జానకిరాంపేటలో నివసిస్తోంది. 20 రోజుల క్రితం మున్నీ అనే యువతి కుమారి ఇంటికొచ్చి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో 15 రోజుల క్రితం కుమారి తన బంగారు ఆభరణాలను ధరించి ఓ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత వాటిని భద్రపరచింది.

ఆ సమయంలో అక్కడే ఉన్న మున్నీ కన్ను నగలపై పడింది. అదను కోసం ఎదురుచూసి వాటిని కాజేసింది. ఈ నెల 24వ తేదీన నగలు కనిపించకపోవడంతో కుమారి ఆందోళనకు గురై వెంటనే రెండో పట్టణ ఎస్సై నరేష్‌కు ఫిర్యాదుచేసింది. మున్నీపై అనుమానం ఉందని వారికి చెప్పింది. పోలీసులు దర్యాప్తు చేయగా కుమారి నగలను మున్నీ కాజేసినట్లు విచారణలో తేలింది. సోమవారం మున్నీని  అరె స్ట్ చేసి రూ.3.60 లక్షల విలువ చేసే 18 సవర్ల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement