మునగపాక పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత | villagers dharna due to lands re survey | Sakshi
Sakshi News home page

మునగపాక పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

Sep 24 2015 1:25 PM | Updated on Aug 21 2018 9:20 PM

విశాఖ జిల్లాలోని మునగపాక తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది.

విశాఖ: విశాఖ జిల్లాలోని మునగపాక తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మునగపాక టీచర్స్ కాలనీ 138, 139 సర్వే నెంబర్లలోని ఖాళీ భూములను రీసర్వే చేయాలంటూ స్థానికులు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తహశీల్దార్ కార్యాలయం భవనం పైకి ఎక్కి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయబోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. సదరు యువకుడ్ని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో స్థానికులు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement