ట్రాలీని ఢీకొన్న లారీ: ఇద్దరు డ్రైవర్లకు గాయాలు | trally coiled with auto, gas cylendre burnt | Sakshi
Sakshi News home page

ట్రాలీని ఢీకొన్న లారీ: ఇద్దరు డ్రైవర్లకు గాయాలు

Aug 23 2015 6:05 PM | Updated on Sep 3 2017 8:00 AM

వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన నిల్చొని ఉన్న ట్రాలీ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయాపడ్డారు.

నాయుడుపేట: వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన నిల్చొని ఉన్న ట్రాలీ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయాపడ్డారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట శివారులోని జాతీయ రహదారిపై ఉన్న కూడలి దగ్గర ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో లారీ క్యాబిన్‌ నుంచి మంటలు చెరగేడంతో వంటకోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.

దీంతో లారీలోని ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు 108కు ఫోన్ చేసి క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. డ్రైవర్లు ఇద్దరూ నిఖిల్(36), జంగయ్య(43) నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిలో నిఖిల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement