భారీ గా ఎర్రచందనం పట్టివేత | Redwood Siege | Sakshi
Sakshi News home page

భారీ గా ఎర్రచందనం పట్టివేత

Dec 31 2015 9:51 AM | Updated on Sep 3 2017 2:53 PM

బుధవారం అర్థరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు.

బుధవారం అర్థరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వివరాలివీ.. తిరుపతి రూరల్ మండలం మంగళంలోని రిక్షా కాలనీ, జూపార్క్ వద్ద అర్థరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. వారు రాళ్లతో దాడికి దిగగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కూలీలు పలాయనం చిత్తగించారు. ఆ ప్రదేశంలో గాలించగా రూ.50 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన ఒక కూలీని పట్టుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.



 

Advertisement
 
Advertisement
Advertisement