బాల త్రిపురా సుందరి సమేత శివాలయంలో పూజారి దంపుతులను కిరాతకంగా హతమార్చారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెల్లూరు మండలం పెద్ద చెరుకూరు గ్రామంలోని బాల త్రిపురా సుందరి సమేత శివాలయంలో పూజారి దంపుతులను కిరాతకంగా హతమార్చారు. వివరాలు.. గ్రామంలోని బాల త్రిపురా సుందరి సమేత శివాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రమౌళి స్వరరావు ఆలయ ఆవరణలో నివాసం ఉంటున్నారు.
శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు చంద్రమౌళి, అతని భార్య పుష్ఫ వేణిలను తలపగలగొట్టి హత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం పాలు ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి విగత జీవులుగా పడి ఉన్న పూజారి దంపతులను చూసి స్థానికులకు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


