breaking news
priest couple
-
చదివించి పోలీస్ అధికారిణి చేస్తే.. చివరికి భార్య ఇచ్చిన ట్విస్టు మామూలుగా లేదు!
భోపాల్: ఓ భార్య భర్తల కథ. కానీ చిన్న కథ కాదు. భార్యకి తానెప్పటికైనా పోలీస్ జాబ్ సాధించాలనే కల ఉండేది. చదువు, పెళ్లి ఆమె కలకు అడ్డంకిగా మారాయి. రోజులు గడిచే కొద్దీ తాను అనుకున్నది సాధించలేక పోతున్నానన్న బాధ ఆమెను తొలి చేది. భార్య తీరును గమనించిన భర్త అసలు విషయం ఏంటో అడిగాడు. అందుకు భార్య తాను పోలీస్ కావాలని కోరికను బయటపెట్టింది. అంతేనా.. ఇప్పటి నుంచి ఆ ప్రయత్నాలు మొదలు పెట్టమని ప్రోత్సహించాడు. అనుకున్నట్లు గానే భార్యను ఎస్సైని చేశాడు. కట్ చేస్తే… భార్య భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏమైందంటే..ఫ్యామిలీ కోర్టులో నడుస్తున్న కేసు వివరాల ప్రకారం.. భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి పూజారి. అతని భార్యకు పోలీస్ అవ్వాలనేది చిన్ననాటి కోరిక. ఆ కోరికను నెరవేర్చేందుకు ఆర్థికంగా, మానసికంగా తోడ్పడ్డాడు. ఆమె పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా మారేందుకు తాను దాచుకున్న పొదుపును ఖర్చు చేశాడు. తన సంప్రదాయ జీవనశైలిని కొనసాగిస్తూ భార్య విజయాన్ని అందించేందుకు సంకల్పించాడు.అనుకున్నట్లుగానే భార్య ఎస్సై అయ్యింది. కానీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భార్యలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. భర్త చేస్తున్న వృత్తి, వస్త్రధారణ తనకు నచ్చడం లేదని పలుమార్లు చెప్పింది. భర్త మాత్రం తన రూపాన్ని మార్చుకోనని, సంప్రదాయాన్ని విడిచిపెట్టబోనని ఖరాఖండీగా చెప్పాడు. దీంతో భార్య విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఆమె తన కొత్త సామాజిక స్థితికి భర్త సరిపోడని వాదిస్తోంది. భర్త మాత్రం ‘నేను నా సంప్రదాయాన్ని విడిచిపెట్టను. అదే నా జీవన విధానం’ అని స్పష్టం చేశాడు.ఈ సంఘటన భోపాల్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఆకస్మిక జీవనశైలి మార్పులు, సామాజిక స్థితి పెరుగుదల వల్ల ఇలాంటి విభేదాలు వస్తాయని కౌన్సిలర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు భర్త నుంచి భార్యకు విడాకులు ఇచ్చేందుకు న్యాయమూర్తి తిరస్కరించారు. దంపతులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. -
పూజారి దంపతుల దారుణ హత్య
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెల్లూరు మండలం పెద్ద చెరుకూరు గ్రామంలోని బాల త్రిపురా సుందరి సమేత శివాలయంలో పూజారి దంపుతులను కిరాతకంగా హతమార్చారు. వివరాలు.. గ్రామంలోని బాల త్రిపురా సుందరి సమేత శివాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రమౌళి స్వరరావు ఆలయ ఆవరణలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు చంద్రమౌళి, అతని భార్య పుష్ఫ వేణిలను తలపగలగొట్టి హత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం పాలు ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి విగత జీవులుగా పడి ఉన్న పూజారి దంపతులను చూసి స్థానికులకు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


