'బాక్సైట్పై రోజుకో రకంగా మాట్లాడుతున్న బాబు' | P Balaraju takes on chandrababu | Sakshi
Sakshi News home page

'బాక్సైట్పై రోజుకో రకంగా మాట్లాడుతున్న బాబు'

Dec 2 2015 7:13 PM | Updated on Jul 11 2019 8:34 PM

'బాక్సైట్పై రోజుకో రకంగా మాట్లాడుతున్న బాబు' - Sakshi

'బాక్సైట్పై రోజుకో రకంగా మాట్లాడుతున్న బాబు'

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రోజుకో రకంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పి.బాలరాజు ఆరోపించారు.

విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రోజుకో రకంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పి.బాలరాజు ఆరోపించారు. బుధవారం విశాఖపట్నంలో 2010లో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, నాటి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, సివేరి సోమల బాక్సైట్ తవ్వకాలపై అసెంబ్లీలో మాట్లాడిన రికార్డ్లను మాజీ మంత్రి బాలరాజు విడుదల చేశారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ...

బాక్సైట్పై ఆంధ్రయూనివర్శిటీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. సదరు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏజెన్సీలో ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.  జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement