సౌదీలో భారతీయుడి దుర్మరణం.. ఇద్దరికి గాయాలు | One Indian killed, two injured in Saudi Arabia attack | Sakshi
Sakshi News home page

సౌదీలో భారతీయుడి దుర్మరణం.. ఇద్దరికి గాయాలు

Sep 19 2015 8:56 PM | Updated on Sep 3 2017 9:38 AM

సౌదీ అరేబియా జజాన్ ప్రాంతంలోని సమ్తా ఆసుపత్రిపై హుతీ తిరుగుబాటు దళాలు జరిపిన దాడుల్లో ఒక భారతీయుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

న్యూఢిల్లీ: సౌదీ అరేబియా జజాన్ ప్రాంతంలోని సమ్తా ఆసుపత్రిపై హుతీ తిరుగుబాటు దళాలు శుక్రవారం జరిపిన దాడుల్లో ఒక భారతీయుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. గాయపడ్డ ఇద్దరికి మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ దాడిలో ఇద్దరు బంగ్లాదేశీలు కూడా చనిపోయారు. సౌదీ నేతృత్వంలో యెమెన్ పై జరుగుతున్న వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఆసుపత్రిపై దాడికి పాల్పడినట్లు హుతీ దళాలు ప్రకటించాయి.

Advertisement
 
Advertisement
Advertisement