ఎన్కౌంటర్లో లష్కరే కమాండర్ హతం | Lashkar-e-Toiba terrorist killed in encounter in jammu Kashmir | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్లో లష్కరే కమాండర్ హతం

Jan 19 2017 9:05 AM | Updated on Sep 5 2017 1:37 AM

జమ్ము కశ్మీర్లో భద్రత బలగాలతో జరిగిన ఎన్కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ హతమయ్యాడు.

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో భద్రత బలగాలతో జరిగిన ఎన్కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ అబు ముసైబ్‌ హతమయ్యాడు. గురువారం ఉదయం బండిపొర జిల్లాలోని హజిన్‌ ప్రాంతంలో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.

హజిన్ ప్రాంతంలో పార్రే మొహల్లా అనే గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న ఇంటలిజెన్స్ వర్గాల సమాచారంతో భద్రత బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. భద్రత సిబ్బంది సోదాలు చేస్తుండగా, లష్కరే తోయిబా కమాండర్ వారిపై కాల్పులు జరిపాడు. ఎదురు కాల్పుల్లో అబు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో స్పెషల్‌ ఆపరేషన్ గ్రూపు సైనికుడు ఒకరు గాయపడ్డారు. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఎన్కౌంటర్లో మరో ఉగ్రవాది హతమయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement