భార్య భర్తపై కేసు నమోదు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన ఏలూరులో జరిగింది.
ఏలూరు: భార్య తనపై కేసు నమోదు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త.. కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన ఏలూరులో జరిగింది. ఏలూరు పవర్ కాలనీకి చెందిన ప్రేమ్‌కిషోర్‌కు నాగలక్ష్మితో వివాహమైంది.
ఈ క్రమంలో భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నాగలక్ష్మి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కోర్టుకు హాజరుపరిచారు. సోమవారం విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన ప్రేమ్‌కిషోర్ తన భార్య చేసిన పని వల్ల మనస్తాపానికి గురై సూసైడ్ నోట్ రాసి వెంట తెచ్చుకున్న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.