కారెక్కిన గుండు సుధారాణి | gundu sudharani joins trs | Sakshi
Sakshi News home page

కారెక్కిన గుండు సుధారాణి

Oct 31 2015 7:58 PM | Updated on Aug 15 2018 9:30 PM

టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్ గూటికి చేరారు.

హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్ గూటికి చేరారు. శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరారు. గుండు సుధారాణి సైకిల్‌ను వీడి కారు ఎక్కనున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల నేపథ్యంలో గుండు సుధారాణి పార్టీ మారడం టీడీపీకి ఎదురుదెబ్బ కానుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతునిచ్చే ఉద్దేశంతో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement