పట్టాలు తప్పిన గూడ్స్: పలు రైళ్లు రద్దు | Goods Train Derails, Few Trains diverted and cancelled | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్: పలు రైళ్లు రద్దు

Dec 21 2015 4:14 PM | Updated on Sep 3 2017 2:21 PM

పట్టాలు తప్పిన గూడ్స్: పలు రైళ్లు రద్దు

పట్టాలు తప్పిన గూడ్స్: పలు రైళ్లు రద్దు

విజయనగరం జిల్లాలో సోమవారం గూడ్సు రైలు పట్టాలు తప్పింది.

గరివిడి: విజయనగరం జిల్లా గరివిడి మండలం లక్ష్మీపురం వద్ద సోమవారం గూడ్సు రైలు పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి ఫర్టిలైజర్స్(యూరియా, డీఏపీ)తో హౌరా వైపు వెళ్తున్న గూడ్స్ రైలు చీపురుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో బోల్తా కొట్టింది.

దీంతో ఆరు వ్యాగెన్లు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. రైల్వే ట్రాక్పై యూరియా బస్తాలు చెల్లాచెదురయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే శాఖ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా ఆ మార్గంలో వెళ్లవలసిన పలు రైళ్లను రద్దు చేయగా.. మరి కొన్నింటిని దారి మళ్లించారు. ఈ మేరకు రైల్వే శాఖ వివరాలు తెలియజేసింది.

రద్దయిన రైళ్లు :
పలాస నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ప్యాసింజర్ (58525 )
విశాఖపట్నం నుంచి పలాస వెళ్లాల్సిన ప్యాసింజర్ (67293 )
విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన ప్యాసింజర్ (67296)
భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ప్యాసింజర్ (18495)

దారి మళ్లించిన రైళ్లు :
రామేశ్వరం నుంచి భువనేశ్వరం వెళ్లాల్సిన రైలును వయా విజయనగరం - రాయగడ - సంబల్‌పూర్ - తిట్లానగర్ మీదుగా భువనేశ్వర్ వెళ్లే ఏర్పాట్లు చేశారు.

చెన్నై నుంచి హౌరా వెళ్లాల్సిన హౌరా మెయిల్‌ను వయా రాయగడ సంబల్‌పూర్ మీదుగా దారి మళ్లించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement