ఎయిర్‌పోర్టులో పాత నోట్ల కట్టలు | customs officers seize Rs.10 lakh in old currency denomination at airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో పాత నోట్ల కట్టలు

Dec 8 2016 5:35 PM | Updated on Sep 4 2017 10:14 PM

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో పాత కరెన్సీ నోట్ల కట్టలు వెలుగుచూశాయి.

శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో పాత కరెన్సీ నోట్ల కట్టలు వెలుగుచూశాయి. కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వద్ద రూ.10లక్షల నగదు బయటపడింది. వ్యక్తి ఎయిరిండియా విమానంలో మస్కట్ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
 
డబ్బు ఎలా వచ్చిందనే దానిపై సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దొరికిన మొత్తంలో రూ.1.76 లక్షలు పాత రూ.వెయ్యి నోట్లు కాగా మిగిలినవి పాత రూ.500 నోట్లు.

Advertisement
 
Advertisement
Advertisement