breaking news
Rs.10 lakh
-
ఈ గాడిద ధర అక్షరాల రూ.10 లక్షలు
చండీగఢ్: టిప్పు అలాంటి ఇలాంటి గాడిద కాదు. గుర్రంలా ఒడ్డూ పొడువున్న టిప్పు ధర పది లక్షల రూపాయలట. మామూలు గాడిద లక్ష రూపాయల వరకుంటే దీని ధర అంతకు పదింతలు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ గాడిదల వ్యాపారి ఐదు లక్షల రూపాయలకు కొంటా అంటే కూడా ఇవ్వలేదని, పది లక్షలకైతేనే అమ్ముతానని హర్యానాలోని సోనాపేట్ జిల్లాకు చెందిన గాడిద యజమాని రాజ్ సింగ్ చెబుతున్నారు. ఈ గాడిదకు రోజుకు ఐదు కిలోల మినుములు, నాలుగు లీటర్ల పాలు, 20 కిలోల పచ్చిగడ్డి ఆహారం. అందుకు రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చవుతుందట. ఈ గాడిదను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు కూడా తీసుకెళతానని రాజ్ సింగ్ తెలిపారు. ఇలాంటి గాడిద చుట్టుపక్క రాష్ట్రాల్లో కూడా దొరకదని, మగ గాడిదల సంకర జాతులను పెంచే ఆయన చెప్పారు. -
ఎయిర్‌పోర్టులో పాత నోట్ల కట్టలు
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో పాత కరెన్సీ నోట్ల కట్టలు వెలుగుచూశాయి. కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వద్ద రూ.10లక్షల నగదు బయటపడింది. వ్యక్తి ఎయిరిండియా విమానంలో మస్కట్ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. డబ్బు ఎలా వచ్చిందనే దానిపై సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దొరికిన మొత్తంలో రూ.1.76 లక్షలు పాత రూ.వెయ్యి నోట్లు కాగా మిగిలినవి పాత రూ.500 నోట్లు.