అర్థరాత్రి చైన్ స్నాచింగ్


సికింద్రాబద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అగంతకులు మహిళ మెడలో పుస్తెల తాడును తెంచుకుపోయారు. శ్రీనివాసనగర్ కు చెందిన సంగీత(28) గురువారం బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై.. భర్తతో కలిసి అర్థరాత్రి సమయంలో తిరిగి వస్తున్నారు. స్కందగిరి ఆలయ సమీపంలో బైక్ పై వచ్చిన అగంతకుడు ఆమె మెడలో ఉన్నగొలుసు తెంపుకు పోయాడు. బంగారు గొలుసు రెండున్నర తులాలు ఉంటుందని బాధితులు తెలిపారు. దీనిపై బాధితురాలు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

Read also in:
Back to Top