బాలుడి చేతిలో పేలిన బాంబు | Bomb blast shatters boy's hands | Sakshi
Sakshi News home page

బాలుడి చేతిలో పేలిన బాంబు

Jan 18 2016 4:14 PM | Updated on Sep 3 2017 3:51 PM

నేలపై గుండ్రంగా కనిపించిన వస్తువును బంతి అనుకుని చేతిలోకి తీసుకోగా.. అది పేలిపోవడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

మైదుకూరు (వైఎస్సార్ జిల్లా) : నేలపై గుండ్రంగా కనిపించిన వస్తువును బంతి అనుకుని చేతిలోకి తీసుకోగా.. అది పేలిపోవడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లి గ్రామం సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ప్రసాద్ (14) అనే బాలుడు పశువులను మేపేందుకు గ్రామశివార్లకు వెళ్లాడు.

అక్కడ నేలపై గుండ్రంగా కనిపించిన దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దానికి వైర్లు బిగించి ఉండడంతో... చేతిలోకి తీసుకున్న వెంటనే పేలిపోయింది. ఈ ఘటనలో బాలుడి కుడిచేయి మణికట్టు వరకు తెగిపడిపోగా, ఎడమచేతి ఐదు వేళ్లూ తెగిపోయాయి. తీవ్రంగా గాయపడిన అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని అక్కడే ఉన్న మరో రెండు బాంబులను నిర్వీర్యం చేశారు. వీటిని అక్కడ ఎవరు పెట్టి ఉంటారనే విషయాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement