పెద్ద దర్గాలో ఏఆర్ రెహ్మాన్ | ar rahman visits kadapa pedda dargah | Sakshi
Sakshi News home page

పెద్ద దర్గాలో ఏఆర్ రెహ్మాన్

Feb 23 2016 2:20 PM | Updated on Aug 24 2018 6:44 PM

ప్రముఖ దర్గాలో ఒకటైన కడప పెద్ద దర్గా( అమీన్ పీర్ దర్గా) ఉరుసు ఉత్సవాల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మంగళవారం దర్శించుకున్నారు.

హైదరాబాద్: ప్రముఖ దర్గాలో ఒకటైన కడప పెద్ద దర్గా( అమీన్ పీర్ దర్గా) ఉరుసు ఉత్సవాల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ , ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. దర్గాలో రెహ్మాన్ ప్రార్థనలు చేశారు. రెహ్మాన్ చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 
 
కాగా ఉరుసు ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణంతో పాటు సమీప ప్రాంతాలు కిటకిటలాడాయి. ముందుగా దర్గా ఆవరణలో మలంగ్‌షాను మేళతాళాలతో పీఠం వద్దకు తీసుకొచ్చి దీక్ష వహింపజేశారు. అర్ధరాత్రి దర్గా గురువులు ఊరేగింపుగా గంధం కలశాన్ని తీసుకొచ్చి ప్రధాన గురువుల మజార్ వద్ద సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement