పోలీసులపై తేనెటీగల దాడి | 7 police injured in bees attack | Sakshi
Sakshi News home page

పోలీసులపై తేనెటీగల దాడి

Aug 17 2015 2:00 PM | Updated on Sep 3 2017 7:37 AM

వైజాగ్ లోని ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్‌కు వెళ్లిన స్పెషల్ పార్టీ పోలీసులపై తేనెటీగలు దాడి చేశాయి.

జీ మాడుగుల: వైజాగ్ లోని ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్‌కు వెళ్లిన స్పెషల్ పార్టీ పోలీసులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఏడుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ పది మంది బృందంపై ఆదివారం రాత్రి అటవీ ప్రాంతంలో తేనెటీగలు దాడి చేశాయి. పోలీసులు వాటి బారి నుంచి బయటపడి మద్దెగరువు ప్రాంతానికి చేరుకుని ప్రైవేటు వాహనంలో ఆదివారం అర్ధరాత్రి జీ మాడుగుల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పాడేరు కమ్యూనిటీ ఆస్పత్రిలో పోలీసలు చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement