ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లే వారిని టార్గెట్‌గా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్ననలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం: ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లే వారిని టార్గెట్‌గా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్ననలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖజిల్లా మహారాణిపేట పోలీసులు సోమవారం అల్లీపురం వాసన్ ఐకేర్ ఆసుపత్రి వద్ద యువకులను పట్టుకున్నారు. వారి నుంచి 240 గ్రాముల బంగారం, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు మహారాణిపేటకు చెందిన స్ధానిక యువకులు. వీరిపై పలు నేరాల్లో13 కేసులు ఉన్నాయి.