డయేరియాతో 30 మంది ఆస్పత్రిపాలు | 30 people hospitalized with diarrhea | Sakshi
Sakshi News home page

డయేరియాతో 30 మంది ఆస్పత్రిపాలు

Feb 24 2016 10:43 AM | Updated on Sep 3 2017 6:20 PM

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చిన్నదోర్జలో డయేరియా విజృంభించింది.

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చిన్నదోర్జలో డయేరియా విజృంభించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు గ్రామానికి చెందిన సుమారు 30 మంది అస్వస్థతకు గురికాగా వారిని మూడు అంబులెన్సుల్లో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు ఉన్నాయి. ఊట నీరుని తాగునీరుగా వినియోగిస్తున్నారు. ఇది కలుషితం కావడం వల్లే డయేరియాకు దారితీసిందని సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement