ఉరేసుకుని ప్రేమికుడు ఆత్మహత్య.. కలకలం! | boy commits suicide inside a police station in repalle | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని ప్రేమికుడు ఆత్మహత్య.. కలకలం!

Jan 5 2018 8:48 AM | Updated on Nov 6 2018 8:08 PM

boy commits suicide inside a police station in repalle - Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని రేపల్లె మండలంలో కలకలం చెలరేగింది. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందని ఓ యువకుడు మనస్థాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  వివరాలివి.. ప్రేమ పేరుతో అతను ఓ మైనర్‌ బాలికను పెళ్ళి చేసుకున్నాడు. దీంతో ప్రేమికులిద్దరిని కౌన్సిలింగ్‌ నిమిత్తం పోలీసులు స్టేషన్‌ను తీసుకొచ్చారు. కౌన్సిలింగ్‌ అనంతరం ఆ అమ్మాయిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.

దీంతో తీవ్ర మనస్థాపనికి గురైన ఆ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్రుంకి వెళ్లిన ఆ యువకుడు చాలాసేపు వరకూ తిరిగి రాకపోవడంతో పోలీసులు తలుపులు పగులగొట్టి చూశారు. అతడు  ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. మృతుడు రేపల్లె మండలం గుడికాయలంకకు చెందిన శ్రీనివాసరావు అని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement