పీడీ అకౌంట్‌ల వివాదం

IYR Krishna Rao Guest Columns On PD Accounts Issue - Sakshi

సందర్భం

ఈమధ్య పార్లమెంట్‌ సభ్యులు జీవీఎల్‌ నర సింహారావు పీడీ అకౌం ట్లలో 50 వేల కోట్ల రూపాయల దాకా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఖర్చ యిందని ఇది 2జీ స్కామ్‌ అంత పెద్ద కుంభకోణం అని పేర్కొంటూ ఒక తేనె తుట్టెను కదిపారు. రాష్ట్ర మంతా గత మూడు నాలుగు రోజులుగా ఈ అంశంపై చర్చతోనే మారుమోగుతున్నది. పీడీ అకౌంట్లు పేరుకు వ్యక్తిగత ఖాతాలుగా పేర్కొన్నా వాస్తవానికి ఇవి అధికారిక ఖాతాలే. వివిధ ప్రభుత్వ సంస్థల కార్యనిర్వహణాధికారులు వివిధ ప్రభుత్వ శాఖాధిపతులు ఈ అకౌంట్లను నిర్వహిస్తుంటారు. మార్చి నెల చివర కొత్త ఆర్థిక సంవత్సరానికి శాసన సభ బడ్జెట్‌ను ఆమోదిస్తుంది. దీంతో ద్రవ్య విని యోగ బిల్లును కూడా శాసనసభ ఆమోదించడం జరుగుతుంది. ఈ రెండూ జరిగిన తరువాతనే ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వ ఖాతాలలో పరిపాలనా యంత్రాంగం ఖర్చు చేయడానికి వీలవుతుంది.

ప్రభుత్వ వ్యయం ప్రధానంగా ఆర్థిక శాఖలోని రెండు శాఖాధిపతుల ద్వారా జరుగుతుంది. నీటి పారుదల, భవనాలు, రోడ్లు వంటి మూలధన ప్రాజె క్టుల ఖర్చు పనులు ఖాతాల శాఖాధిపతి ద్వారా జరు గుతుంది. ఇక సాధారణ పరిపాలన ఖర్చు జీతాలు వగైరా ఖజానా ఖాతాల శాఖాధిపతి ద్వారా జరుగు తుంది. ఈ సాధారణ పద్ధతిలో ప్రభుత్వ పద్దులలో ఖర్చు జరిగే విధానంలో నిధులు విడుదల చేసే ముందు బిల్లులను తనిఖీ చేసే విధానం ఉంటుంది. అన్నివిధాలా సరిగా ఉంటే చెల్లింపులు చేయడం లేనిచో లోపాలను ఎత్తిచూపుతూ బిల్లును తిరిగి పంపుతారు. ఈ విధానాన్ని ఆచరించకుండా బిల్లు లకు చెల్లింపు చేయటానికి ఏర్పరచిన వెసులుబాటు పీడీ అకౌంట్‌ విధానం. దీనిలో ఆమోదించిన మొత్తాన్ని ఏకీకృత నిధిలో ఖర్చు చూపి పీడీ అకౌంట్లో జమ చేస్తారు. ఆపైన అవసరాన్ని బట్టి శాఖాధిపతి ఈ ధనాన్ని వ్యయం చేస్తూ ఉంటారు. 

ఇక 2016–17 సంవత్సరం కాగ్‌ రిపోర్ట్‌ పరి శీలిస్తే పీడీ అకౌంట్ల విషయంలో రెండు మూడు ప్రధాన అంశాలను లేవనెత్తారు. దాదాపు సంవత్సర కాలంలో పీడీ అకౌంట్లకు 51 వేల కోట్లు తరలించడం జరిగిందని ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ పద్దుల కింద 22 వేల కోట్ల నిధులు ఉండగా సంవత్స రాంతానికి 26 కోట్ల మిగులు ఉందని పేర్కొన్నారు. ఇది తీవ్రమైన విషయం. రాష్ట్ర బడ్జెట్‌ రూ. 1,32,000 కోట్లయితే అందులో ఎటు వంటి వెసులుబాటు లేని ఖర్చు 65వేల కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని జీతా లమీద, పెన్షన్లమీద వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేస్తారు. ఇక మిగిలిన ఖర్చు 67 వేల కోట్లు. అందులో పీడీ అకౌంట్ల ద్వారా ఖర్చయిన మొత్తం 47 వేల కోట్లు. అంటే వెసులుబాటు ఉన్న ఖర్చులో 70 శాతం ఖర్చు పీడీ అకౌంట్ల ద్వారానే జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్‌ను బిల్లుల తనిఖీకి అవకాశమున్న సాధన విధానం ద్వారా కాకుండా పీడీ అకౌంట్‌ విధానం ద్వారా ఖర్చు పెట్టడం తప్పకుండా అను మానాలకు దారి తీసే అవకాశం ఉంది. కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాడాల్సిన పీడీ అకౌంట్‌ విధా నాన్ని సింహభాగం చెల్లింపుల కోసం వాడటం సరైన విధానం కాదు.

ఇక కాగ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్న రెండో ప్రధాన అంశం ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే మన రాష్ట్రంలో పీడీ అకౌంట్లు వేల సంఖ్యలో ఉన్నాయని. మన రాష్ట్రంలో పీడీ అకౌంట్లు 58 వేల దాకా ఉండగా మిగి లిన రాష్ట్రాల్లో కేవలం వందల సంఖ్యలో ఉన్నాయి. దీనికి చాలా వరకు కారణం మన రాష్ట్రంలో స్థానిక సంస్థలను వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్థలను పీడీ అకౌంట్ల పరిధిలోకి తీసుకురావడమే. ఇది సరైన విధానం కాదు. ఆ సంస్థల నిధులను వారి సాధారణ ఖాతాలకు జమచేసి పీడీ అకౌంట్లను మూసివేయా ల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ విధంగా చేసినా ఇంకా మన రాష్ట్రంలో పీడీ అకౌంట్ల సంఖ్య పదివేల దాకా ఉండే అవకాశముంది.

కాగ్‌ రిపోర్టులో పేర్కొన్న మరొక ప్రధాన అంశం పీడీ అకౌంట్లలోనే కాకుండా సాధారణ బ్యాంకు ఖాతాలలో కూడా 19 వేల కోట్ల రూపా యల ప్రభుత్వ ధనం ఉన్నదని, దానిని రాబట్టుకుంటే ఆర్బీఐ నుంచి ఆ సంవత్సరం తీసుకున్న రుణానికి సమానం అవుతుందని పేర్కొన్నారు. బయట బ్యాంక్‌ అకౌంట్లలో ఎక్కువకాలం నిధులు ఉంటే అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువ. వాటిని ప్రభుత్వ ఖాతాలో జమ చేసుకోవా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ఆర్థిక శాఖ ఒక పెద్ద చొరవ తీసుకోవడం జరిగింది. కానీ అది ఏ కారణాల వల్లనో ఆగిపోయింది.స్థూలంగా పీడీ అకౌంట్లు శాఖాధిపతులకు కొంత వెసులుబాటు కల్పిస్తాయి. కానీ ఎప్పుడో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పరిమితంగా వాడవలసిన ఈ పీడీ అకౌంట్‌ విధానాన్ని పరిపాటిగా అన్ని రకాల నిధుల వినియోగానికి ఉపయోగిస్తే ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతినే ప్రమాదం ఉంది.

వ్యాసకర్త: ఐవైఆర్‌ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి  iyrk45@gmail.com

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top