వారఫలాలు (19 ఏప్రిల్‌ నుంచి 25 ఏప్రిల్‌ వరకు)

Weekly Horoscope in Telugu 19th to 25th April - Sakshi

మేషం: ముఖ్య కార్యక్రమాలు సాఫీగా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చిస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. దేవాలయ దర్శనాలు. కుటుంబంలో సమస్యలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడులు తగ్గుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహం. వారం చివరిలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృషభం:ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆప్తుల సలహాలు, సూచనలు పాటిస్తారు. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు శుభవార్తలు. వారం  మధ్యలో ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మిథునం: కొన్ని పనులు సమయానికి సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు పాటిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఆశించినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో  బంధువిరోధాలు. ఖర్చులు పెరుగుతాయి. ఎరుపు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: చేపట్టిన పనులు కొంత నిదానిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. మీ ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారస్తులు కోరుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం కొంత తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు నుంచి విముక్తి. వాహన, గృహయోగాలు కలిగే సూచనలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: ఇంటాబయటా అనుకూలమైన సమయం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. ఆస్తుల ఒప్పందాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత ఊరట లభిస్తుంది. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు అంచనాలు నిజమవుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ పఠించండి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు కొత హోదాలు దక్కే అవకాశం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత అనుకూల సమయం. వారం  ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం :ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. మీ మాటే చెల్లుబాటు కాగలదు. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. వాహనయోగం. మీ నిర్ణయాలు అందరూ స్వాగతిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అంచనాలు నిజమవుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ధనుస్సు:పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వాహనాలు, భూములు కొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు దక్కుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మకరం: రాబడి కొంత తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. అనుకున్న పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. నూతన ఉద్యోగయోగం. వివాదాల పరిష్కారం. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కుంభం:ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని లక్ష్యాలు నెరవేరతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు నూతనోత్సాహం. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సమస్యలు తీరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. నీలం, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు పఠించండి.

మీనం: ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతస్థితి రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top