ఈ వేసవి చల్లచల్లగా... | this summer cool.. cool... | Sakshi
Sakshi News home page

ఈ వేసవి చల్లచల్లగా...

Mar 12 2016 11:18 PM | Updated on Sep 3 2017 7:35 PM

ఈ వేసవి చల్లచల్లగా...

ఈ వేసవి చల్లచల్లగా...

ఉన్నట్టుండి చుట్టాలు వచ్చారు. చల్లగా ఏ మజ్జిగో, జ్యూసో ఇద్దామనుకుంటాం. ఐస్ క్యూబ్స్ వేస్తే ఎంతకీ కరగవు.

ఉన్నట్టుండి చుట్టాలు వచ్చారు. చల్లగా ఏ మజ్జిగో, జ్యూసో ఇద్దామనుకుంటాం. ఐస్ క్యూబ్స్ వేస్తే ఎంతకీ కరగవు. డ్రింక్ ఓ పట్టాన చల్లబడదు. సమయం వృథా.
* రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. పిల్లలు ఉన్నట్టుండి గొడవ మొదలుపెడతారు. రోడ్డుపక్కన అమ్మే రంగురంగుల ఐస్ గోలా కావాలని ఏడుస్తారు. కొనిద్దామంటే వాళ్ల ఆరోగ్యాలు పాడవుతాయేమోనని భయం.
* ఈ రెండు ఇబ్బందులనూ ఒకేసారి తీరుస్తుంది ఇక్కడ కనిపిస్తోన్న బుజ్జి మెషీన్. దీన్ని ఐస్ క్రషర్ అంటారు. చూడ్డానికి చిన్న బాక్సులా కనిపిస్తోన్న దీనిలో ఐస్‌క్యూబ్స్ వేసి, ప్లగ్గు కనెక్ట్ చేసి ఆన్ చేస్తే చాలు. క్షణంలో ఐస్ అంతా పొడిలా అయిపోతుంది. అంటే క్రష్ అవుతుంది. దీన్ని డ్రింక్స్‌లో కలిపితే క్షణాల్లో చల్లబడిపోతాయి. ఇందులో కాస్త రంగులు, చక్కెర నీళ్లు కలిపి చుట్టి ఇస్తే పిల్లలకు ఐస్ క్యాండీ రెడీ అయిపోతుంది. ఖరీదు కూడా పెద్ద ఎక్కువేం కాదు. మోడల్, సైజును బట్టి రెండు వందల రూపాయల నుంచి మొదలవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement